మా డబ్బులు మాకుకావాలి... అంతే అన్నట్లు ఉంది ఆన్ లైన్ రుణయాప్ తీరు. వారి వేదింపులకు రుణంతీసుకున్న వారు ప్రాణాలు తీసుకుంటున్నా తీరు మారటం లేదు.ఇటీవల సింగరేణిలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న ఓయువకుడిని బలితీసుకున్నారు. డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో కుటుంభ సభ్యులకు అశ్లీలఫోటోలతో చిత్రవధకు గురి చేశారు. అవమానం భరించలేక యువకుడు బలవన్మరణాకి పాలుపడ్డాడు. ఆన్ లైన్క్రికెట్ బెట్టింగ్ లో కోంత డబ్బు పోగొట్టుకున్న యువకుడు... అవసరాల కోసం మనీవ్యూనుంచి 60వేలు రుణంతీసుకున్నట్లు తెలిసింది.